మాల్యాను వెనక్కి తీసుకురానున్న భారత ప్రభుత్వం
- February 17, 2017
బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. భారతదేశం- యునైటెడ్ కింగ్డమ్ పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (ఎంఎల్ఏటీ)ని వినియోగించి మాల్యాను వెనుకకు పిలిపించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద నమోదైన కేసుల విచారణకు ఈ కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మాల్యా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఐడీబీఐ బ్యాంకుకు రూ.900 కోట్లు ఎగ్గొట్టిన కేసులో తమ అభ్యర్థనను కోర్టు గత వారం మన్నించిందని ఈడీ అధికారులు తెలిపారు. యునైటెడ్ కింగ్డమ్ హోం మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ఆదేశాలను అమలు చేసేందుకు మన దేశ హోం మంత్రిత్వ శాఖకు ఇప్పుడు అవకాశం కలిగిందన్నారు. దీనికి సంబంధించి కోర్టు జారీ చేసిన రిక్వెస్ట్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







