పోలీసుగా రానున్న శర్వానంద్
- February 17, 2017
వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. శర్వానంద్ కి ఈ మధ్య కాలంలో మంచి కథలు రావటంతో వరుస చిత్రాలను విజయాల బాట పట్టిస్తున్నాడు. 2017వ సంవత్సరం ఆరంభంలోనే 'శతమానంభవతి' చిత్రంతో తన కెరీర్లో అతిపెద్ద హిట్టుని అందుకున్నాడు. శతమానంభవతి చిత్రం భారీ సక్సెస్ ని చూడటంతో ఇక నుండి శర్వానంద్ హీరోగా వస్తున్న చిత్రాలకి భారీ క్రేజ్ ఏర్పడుతుంది. బాక్సాపీస్ లో సైతం శర్వానంద్ చిత్రాలకి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఇందులో భాగంగానే శర్వానంద్ మరోసారి తన మూవీతో సమ్మర్ లో సందడి చేయటానికి రెడీ అయ్యాడు. సమ్మర్ లో పెద్ద హీరోల భారీ చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ..సంక్రాంతి పోటీనే తట్టుకున్న తను ఈసారి సమ్మర్ పోటీని సైతం తట్టుకోగలను అని అంటున్నారు. శర్వానంద్ ప్రస్తుతం కొత్త దర్శకుడు చంద్రమోహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ మూవీకి సంబంధించిన టాకీ పార్టీ తాజాగా పూర్తయింది. ఒక్క పాటలు మినహా ఈ సినిమా షూటిం తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తి కావొస్తున్నాయి. దాదాపు ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో ఉండి టాప్ హీరోలకి ధీటుగా శతమానంభవతి సినిమాతో మంచి సక్సెస్ ని చూసిన శర్వానంద్.ఈసారి కూడ పెద్ద్ హీరోల చిత్రాలకి ధీటుగా వేసవి వినోదాన్ని తన మూవీతో ఇచ్చేందుకు రెడీ అవ్వటం సరికొత్తగా అనిపిస్తుంది. ఈ మూవీలో శర్వానంద్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఏదిఏమైనా శర్వానంద్ వేసవి బరిలో ఉండటం అనేది కొంత సాహసమే అని అంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







