స్కూటర్ మీదొచ్చిన జగన్నాథమ్...
- February 17, 2017
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైన రోజే ఈ సినిమా టైటిల్ ను డీజే దువ్వాడ జగన్నాథమ్ గా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తున్నాడన్న వార్త బయటికి రావటంతో స్టైలిష్ స్టార్ అభిమానులు బన్నీ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ శనివారం రిలీజ్ అయ్యింది. ఎప్పుడు స్టైలిష్ గా కనిపించే బన్నీ, ఈ సారి సాంప్రదాయబద్ధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నుదుటి మీద నామాలతో పాత కాలం స్కూటర్ నడుపుతూ కూరగాయలు తీసుకెళ్తున్న బన్నీ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
సరైనోడు సినిమాతో మాస్ యాక్షన్ హీరోగా రికార్డ్ లను తిరగరాసిన అల్లు అర్జున్, ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో మాత్రం ఒక్క క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ ను మాత్రమే రివీల్ చేశారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









