1000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందుకున్న మున్సిపాలిటీ

- February 18, 2017 , by Maagulf
1000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందుకున్న మున్సిపాలిటీ

మనామా: వరదలు..వర్షం నీరుకి సంబంధించి 1000 పైగా ఫిర్యాదులు నార్త్ గవర్నటే కు గత రెండు రోజులలో వచ్చినట్లు నివేదించారు.సార్, ఆలీ, హమద్ టౌన్ మరియు ఇతర ప్రాంతాలలో సహా గవర్నరేట్ లోని  వివిధ ప్రాంతాల్లో పౌరులు మరియు నివాసితుల ద్వారా ఈ పిర్యాదులు  చేశామని తెలిపారు ఉత్తర ఏరియా మున్సిపాలిటీ డైరెక్టర్ యూసీఫ్  అల్ ఘటం నిర్ధారించారు.1500 కంటే ఎక్కువ ట్యాంకులు వర్షం నీటిని  తోడివేయడం జరిగిందని మరో 26 నీటి ట్యాంకర్లు జెబ్లాట్  హబిషి , సల్మాబాద్, ఆలీవంటి మరియు రౌండ్ అబౌట్  22 సమీపంలోని హమద్ టౌన్ ప్రాంతాల్లో నుండి నిలువ ఉండిపోయిన వర్షం నీటిని సేకరించినట్లు తెలిపారు.పురపాలక సంఘం యొక్క అత్యవసర జట్లు ఈ సమస్య అధిగమించేందుకు   ప్రధానిశ్రీ శ్రీ  ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఆదేశాల ప్రకారం ఈ పనిని వేగవంతంగా పూర్తిచేసినట్లు అల్ ఘటం పేర్కొంది.బహ్రెయిన్ మరియు అరేబియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇటీవల అస్థిర వాతావరణం పరిస్థితులు ద్వారా ప్రభావితం చేయబడ్డాయి. గత వారం ప్రారంభంలో నమోదు వర్షపాతం సాధారణ స్థితిని మించి కురిశాయని  ఇది 17 క్యూబిక్ మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా, కానీ గత రెండు రోజులలో వర్షపాతం 80 క్యూబిక్ మిమీ ని  దాటిపోయిందని ఆ అధికారి చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 24 గంటలు విధుల్లో నిమగ్నమై ఉంటామని, ఆయా ప్రజల సహకారంతో సమస్య అధిగమించడానికి ప్రాముఖ్యతని ఇస్తామని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com