జరిమానా చెల్లించండి లేదా కారు స్వాధీనం చేయండి -దుబాయ్ పోలీస్
- September 19, 2015
5,000 దిర్హమ్స్ కంటే ఎక్కువగా ట్రాఫిక్ జరిమానా బకాయి పడిన లేదా రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన వాహనాలపై దుబాయ్ పోలీసు వారి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు కఠిన చర్యలు తీసుకోనున్నారు. తాఖీదు పంపినప్పటికీ నిర్ణీత గడువు లోగా జరిమానా చెల్లించని వాహన యజమానుల కార్లు జప్తు చేయబడతాయని అక్టింగ్ డైరక్టర్ కల్నల్ జమాల్ అల్ బనై హెచ్చరించారు. వారికి తెలియదనే కారణంతో తప్పించుకోలేరని, వారికి సంబంధించిన సమాచారాన్ని, చిరునామాను అందుబాటులో ఉంచడం వారి బాధ్యతేనని, జరిమానా విధించడానికి వాహనాలను ఆపడం వలన ట్రాఫిక్ కు ఇబ్బoదవుతుందని, నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయనే సందర్భంలోనే ఆపుతామని, వాహనదారులు వారికి డిపార్ట్మెంటు వారు పంపిన SMS లను గమనించుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఇంకా 50 దిర్హమ్స్ను చెల్లించడం ద్వారా ఏ విధమైన బకాయిలు లేవనే ధృవ పత్రం శాఖ వారు ఇస్తారని కూడా తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్







