గాయపడ్డ 8 మందిని ఆకాశమార్గం ద్వారా తరలించిన అబుధాబీ పోలీసులు
- September 19, 2015
పోలీసు డిపార్ట్‌మెంటు వారి ఏర్ వింగ్ డిపార్ట్‌మెంట్ వారు మానవతా దృక్పధంతో ప్రధమ చికిత్స అనంతరం ఏర్ అంబులెన్స్ ద్వారా అల్ మాఫ్రాక్ ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్స్ రూం నుండి వచ్చిన 5 కాల్స్‌ను అత్యంత వృత్తి నైపుణ్యంతో చక్కబెట్టారు. మొదట, అల్ ఖత్రామ్ లో ట్రాఫిక్ ఆక్సిడెంట్ లో గాయపడిన 14 నుండి 17 సంవత్సరాల వయసుగల ముగ్గురు చిన్నారులను; అల్ ఖాజ్ఞా ప్రాంతం, ట్రక్స్ రోడ్డులో వాహనం తిరగబడడం వల్ల, గాయాలపాలైన భారతీయుని, అబూధాబీ లోని సువైహాన్ లో మోటరు వాహన ప్రమాదంలో గాయపడిన 17 సంవత్సరాల దక్షణాఫ్రికా బాలుడిని, అదేవిధంగా టారిఫ్ లోని జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్న కారు తిరగబడిపోయిన ఘటనలో 32, 30 సంవత్సరాల వయసు గల ఆసియా ఇద్దరు వాసులను, ఆఖరుగా అల్ రువైస్ లో జరిగిన రన్ఓవర్ ప్రమాదంలో గాయపడిన మరొక ఏషియా వాసిని కాపాడారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







