దోహాలో తొలిసారిగా ఇండియన్ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్
- February 18, 2017
దోహా:దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్‌లో మార్చ్ 16 నుంచి 22 వరకు తొలిసారిగా ఇండియన్ ప్రోడక్ట్స్ మరియు ఇండస్ట్రీస్ కోసం ఎగ్జిబిషన్ జరగనుంది. ఖతార్ ఛాంబర్ అండ్ స్క్వేర్ ఎగ్జిబిషన్ మేనేజ్‌మెంట్ ఈ ఎగ్జిబిషన్‌ని నిర్వహిస్తోంది. 6 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేస్తున్నారు. టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, కాశ్మీరీ ప్రోడక్ట్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్ టెక్నాలజీ తరఫున 190 ఇండియన్ కంపెనీల స్టాల్స్ ఈ ఎగ్జిబిషన్‌లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఖతార్ ఛాంబర్ డైరెక్టర్ జనరల్ సలె అల్ షర్కి మాట్లాడుతూ, ఈ తరహా ఎగ్జిబిషన్ తొలిసారిగా నిర్వహిస్తున్నామనీ, తొలి దఫాలోనే మంచి పేరు ఈ ఎగ్జిబిషన్‌కి వస్తుందని చెప్పారు. ఖతార్‌లో ఇండియన్ రాయబారి పి కుమరన్ మాట్లాడుతూ, భారతదేశానికి చెందిన పలు కంపెనీలు, ఉత్పత్తులు ఇక్కడివారిని విశేషంగా ఆకట్టుకోనున్నాయని అన్నారు. ఖతార్, ఇండియా మధ్య ట్రేడ్ వాల్యూమ్ 10 బిలియన్ డాలర్లుగా ఉందని ఆయన వివరించారు. ఇరు దేశాల మధ్యా ట్రేడ్ రిలేషన్స్ ఇంకా బలోపేతమవ్వాలని కుమరన్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









