యుఏఈలోని బంగ్లాదేశీ కార్మికుడి నిజాయితీ
- February 18, 2017
యుఏఈలో బంగ్లాదేశీ కార్మికుడు జహిర్ రెహ్మాన్, తనకు దొరికిన వాలెట్‌ని తనతోపాటు తీసుకెళ్ళిపోకుండా, అది పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగిచ్చి నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే, 42 ఏళ్ళ జహిర్ రెహమ్మాన్, నెలవారీగా 700 దిర్హామ్‌లు జీతానికి పనిచేస్తుంటాడు. పార్క్‌లోని ఓ బెంచ్‌పై అతనికి ఓ వాలెట్ కన్పించింది. అయితే దాన్ని అతను తీసుకుని, గంట సమయానికి పైగా ఎదురుచూశాడు ఎవరైనా దాని కోసం వస్తారేమోనని. అంతలో ఓ వ్యక్తి కంగారు పడుతూ ఆ వాలెట్ కోసం వచ్చాడు. జర్మనీకి చెందిన ఆండ్రియాస్ క్రాస్, ఆ వాలెట్‌ని పోగొట్టుకున్న వ్యక్తి. ఆండ్రియాస్ రాగానే, వివరాలు తెలుసుకుని రెహ్మాన్ అతనికి ఆ వ్యాలెట్‌ని ఇచ్చేశాడు. నేను కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోగలను, వేరొకరి సొమ్ము కోసం ఆశపడనని ఈ సందర్భంగా రెహ్మాన్ చెప్పాడు. యూఏఈలో 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాడాయన. ఈ సంఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని తన విలువైన డాక్యుమెంట్స్, కొంత నగదు, డెబిట్ కార్డ్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ ఆ వ్యాలెట్‌లోనే ఉన్నాయని, రెహ్మాన్ రియల్ హీరో అని వాలెట్ సొంతదారు ఆండ్రియాస్ చెప్పారు. తన వ్యాలెట్‌ని తనకిచ్చినందుకుగాను ఆండ్రియాస్, రెహమాన్‌కి ప్రోత్సాహకం అందజేశారు.
తాజా వార్తలు
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్‌లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!







