మేలో శ్రీలంకకు వెళ్లనున్న మోదీ

- February 18, 2017 , by Maagulf
మేలో శ్రీలంకకు వెళ్లనున్న మోదీ

శ్రీలంకలో మే నెలలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే బౌద్ధ ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక న్యాయ మంత్రి విజయదాస రాజపక్సేను ఉటంకిస్తూ స్థానిక పత్రిక ఒకటి వెల్లడించింది. కొలంబోలో తొలిసారి నిర్వహిస్తున్న 'యూఎన్ వేసాక్‌ డే' వేడుకల్లో పాల్గొనడానికి మోదీ అంగీకరించినట్లు తెలిపింది.
ఈ ఉత్సవాలను ఏటా బౌద్ధ మతస్థులున్న దేశాల్లో జరుపుకుంటారు. మే నెలలో నిండు చంద్రుడు కనిపించే రోజుకు సమీపంలోని ఆదివారం రోజున భక్తులు బుద్ధునికి ప్రత్యేక పూజలు చేస్తారు. మే 12న జరిగే ఈ కార్యక్రమానికి పలు దేశాల నాయకులను ఆహ్వానించారు. చైనా, భారత్, జపాన్ , థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, మయన్మార్, లావోస్, టిబెట్‌ , భూటాన్, తదితర బౌద్ధ ప్రధాన దేశాల నుంచి వేయికి పైగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com