సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ 'బాషా' డిజిటల్ వెర్షన్‌లోకి
- February 18, 2017
సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ 'బాషా' డిజిటల్ వెర్షన్‌లోకి మారుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ డిజిటల్ 'బాషా' విడుదల తేదీని ఖరారు చేశారు. మార్చి 3వ తేదీన భారత్‌లోపాటు రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న జపాన్‌లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. నిజానికి 'బాషా'కు సీక్వెల్ రావాలని అభిమానులు కోరుకున్నారు. కానీ, 'బాషా' లాంటి చిత్రాన్ని మళ్లీ తెరకెక్కించనూ లేము, నేను నటించనూ లేను అని రజనీకాంత్ స్వయంగా ఓ సందర్భంలో పేర్కొన్నారు.
దాంతో 'బాషా' నిర్మాత ఆర్‌ఎం వీరప్పన్ సూపర్‌స్టార్‌పై అభిమానంతో ఈ చిత్రాన్ని డిజిటల్ వెర్షన్‌లోకి మార్పు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య







