శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- February 19, 2017
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రధాన రహదారిపై అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఇద్దరు సుడాన్ దేశీయులను ఎయిర్‌పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఎయిర్‌పోర్టు రక్షణ సిబ్బంది ఒడిశా రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారును గమనించారు. కారును తనిఖీ చేయగా.. అందులో ఇద్దరు సూడాన్ దేశీయులు కనిపించారు. వారి వద్ద కారుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు, పాస్‌పోర్టు, వీసాలు కానీ లేకపోవడంతో వెంటనే ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు కారుతో పాటు విదేశీయులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వరంగల్ లోని ఓ యూనివర్సిటీలో మూడేళ్ళ కోర్సు చదివేందుకు ఆరు నెలల క్రితం హైదరాబాద్ వచ్చామని చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!







