రోడ్లపై స్టంట్స్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవు

- February 20, 2017 , by Maagulf
రోడ్లపై స్టంట్స్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవు

రోడ్లపై తమ వాహనాలతో ఎవరైనా స్టంట్స్‌ చేస్తే వారిపై కఠిన చర్యలుంటాయని దుబాయ్‌ పోలీసులు హెచ్చరించారు. ఓ ఎమిరేటీ యువకుడ్ని ఇప్పటికే అరెస్ట్‌ చేయడం జరిగింది. రోడ్లపై వాహనంతో స్టంట్స్‌ చేస్తూ ఆ యువకుడు చేసిన ఫీట్స్‌కి సంబంధించి వీడియోని వెలుగులోకి తీసుకొచ్చారు. రోడ్డుపై అతి వేగంతో వాహనాన్ని నడుపుతూ, రహదారిపై నిలిచిన నీరు ఎగిరిపడేలా స్టంట్‌ చేసి, కాస్సేపు రోడ్లపై ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేశాడు ఆ యువకుడు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయిన ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. అతని వాహనాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 100,000 దిర్హామ్‌ల వరకు అతనికి జరీమానా విధించే అవకాశం ఉంది. శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లపై కొన్ని చోట& లనీరు నిలిచిపోయింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com