బాలీవుడ్ హాట్ బ్యూటీ రజని సరసన
- February 21, 2017
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో ' 2.0 ' మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం తర్వాత కబాలి ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వం లో ఓ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబదించిన అన్ని పనులు మొదలు పెట్టాడు రంజిత్. తాజాగా ఈ మూవీ లో రజని సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యా బాలన్ ను ఎంపిక చేసారని సమాచారం. ఇప్పటికే ఆమెతో దర్శక , నిర్మాతలు సంప్రదింపులు జరిపారని , ఆమెను కూడా రజని సరసన నటించడానికి ఒకే చెప్పిందని కోలీవుడ్ మీడియా చెపుతుంది.
ఒకవేళ ఇదే నిజమైతే తమిళం లో విద్యా నటించిన మొదటి చిత్రంగా నిలుస్తుంది. ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని రజని అల్లుడు , హీరో ధనుష్ నిర్మిస్తున్నాడు.
ఎన్నో అంచనాల మధ్య రంజిత్ - రజని కాంబినేషన్ లో వచ్చిన కబాలి మూవీ ప్లాప్ కావడం తో ఈసారి ఎలాగైనా రజని తో భారీ హిట్ కొట్టాలని రంజిత్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇక రజని '2 . 0 ' విషయానికి వస్తే ప్రస్తుతం ఈ మూవీ ముంబై లో షూటింగ్ జరుగుతుంది. దాదాపు రూ. 450 కోట్ల తో ఈ మూవీ నీ లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









