అలాంటి వారిని చంపేయండి: హీరో విశాల్
- February 21, 2017
ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక దాడి దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులను, సామాన్య ప్రజలను కలిచివేస్తోంది. కేరళలోని ఎర్నాకులంలో జరిగిన ఆ ఘటనను ఖండిస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాధితురాలికి అండగా నిలుస్తున్నారు. తాజాగా కన్నడ స్టార్ హీరో 'కిచ్చ' సుదీప్, తమిళ నటుడు విశాల్ నిందితులపై నిప్పులు చెరిగారు. విశాల్ స్పందిస్తూ.. 'ప్రఖ్యాత నటి అయ్యుండీ ఇలాంటి ఘటన గురించి ధైర్యంగా బయటకు చెప్పడం ఎంతో గొప్ప విషయం. ఎంతో భద్రత ఉండే సెలబ్రిటీకే ఇలా జరిగితే.. ఇక సామాన్య స్త్రీ పరిస్తితి ఏంటి? నటుల సంఘం తరపున కేరళ ముఖ్యమంత్రికి ఓ లేఖ పంపాము. ఇలా లైంగిక వేధింపులకు పాల్పడే వారిని తుపాకీతో కాల్చి చంపాలని' ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక ఈ ఘటనపై సుదీప్ మాట్లాడుతూ.. 'పర స్త్రీకి గౌరవం ఇవ్వలేని వ్యక్తి.. తన తల్లికి, చెల్లికి కూడా గౌరవం ఇవ్వడు. అలాంటి వాడు ఈ సమాజానికి అనవసరం.
శారీరకంగా బలవంతుడినని నిరూపించుకునేందుకు ఇలాంటి మానవ మృగాలు అప్పుడప్పుడు చెలరేగుతుంటాయి. త్వరగా విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు విధించాల'ని డిమాండ్ చేశాడు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







