అమెరికా డీపోర్టేషన్‌ నిబంధనలు మరింత కఠినం

- February 21, 2017 , by Maagulf
అమెరికా డీపోర్టేషన్‌ నిబంధనలు మరింత కఠినం

అమెరికా డీపోర్టేషన్‌ నిబంధనలు మరింత కఠినం
సరైన పత్రాలు లేని అక్రమ వలసదారులకు చుక్కలే
వాషింగ్టన్‌, ఫిబ్రవరి 21: సరైన పత్రాలు లేని వలసదారులను నిర్దాక్షిణ్యంగా అమెరికా నుంచి బయటకు వెళ్లగొట్టే (డీపోర్టేషన్‌) ప్రక్రియకు ఆ దేశ హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రూపొందించిన రెండు మార్గదర్శక జాబితాలపై అమెరికా అంతర్గత భద్రత శాఖ మంత్రి జాన్‌ ఎఫ్‌.కెల్లీ సంతకం చేశారు. ఇందుకోసం వేలాదిమంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెంట్లను నియమించుకోవడం నుంచి.. వెళ్లగొట్టాల్సిన జాబితా పరిధిని పెంచడం దాకా పలు మార్గదర్శకాలు ఈ రెండు మెమోల్లో ఉన్నాయి.
గతంలోనూ ఉన్న డీపోర్టేషన్‌ నిబంధనలను మరింత కఠినతరం చేయడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకు.. ఒబామా హయాంలో ఇలాంటి అక్రమ వలసదారులు ఎవరైనా తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు లేదా ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు రుజువైనప్పుడు మాత్రమే డీపోర్ట్‌ చేసేవారు. తాజా మార్గదర్శకాల ప్రకారం..

నేర తీవ్రతతో సంబంధం ఉండదు. ప్రభుత్వ పథకాలను అక్రమంగా ఉపయోగించుకున్నట్టు తెలిసినా దేశం నుంచి వెళ్లగొట్టేస్తారు. అలాగే.. అమెరికాలో దాదాపుగా కోటి పది లక్షల మంది..

వారిలో మన భారతీయులు 3 లక్షల మంది దాకా ఉంటారని అంచనా. అయితే, ఇవి డ్రాఫ్టులు మాత్రమేనని వైట్‌హౌస్‌ కౌన్సెల్‌ ఆఫీస్‌ పరిశీలనలో ఉన్నాయని ఒబామా అధికార యంత్రాంగంలోని ఒక అధికారి పేర్కొనడం గమనార్హం. పెద్దల తోడు లేని పిల్లలు, శరణార్థులుగా ఉండాలనుకునేవారు, తమ దేశంలో తమకు ప్రాణాపాయం ఉందని రుజువు చేసుకున్నవారిని మాత్రం మినహాయిస్తారు. ఈ మార్గదర్శకాలపై డెమొక్రాట్లు సహా, వలసదారుల హక్కుల కార్యకర్తల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా.. అమెరికాలోకి వచ్చేవారి ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సోషల్‌ మీడియా సైట్లను తనిఖీ చేయాలన్న డీహెచ్‌ఎస్‌ ప్రతిపాదనపై అమెరికాలోని ఐటీ, హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలోకి వచ్చే విదేశీయులను సోషల్‌ మీడియా అకౌంట్ల పాస్‌వర్డ్స్‌ అడగడం మొదలుపెడితే.. ఇతర దేశాలు కూడా అమెరికన్ల సోషల్‌ మీడియా అకౌంట్ల పాస్‌వర్డ్స్‌ అడగడం మొదలుపెడతాయని, అప్పుడు అమెరికా భద్రత ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com