బహ్రెయిన్‌లో ముగ్గురు కార్మికులు మృతి
- February 22, 2017
మనామా: ముగ్గురు వలసదారులు పొగ పీల్చడం కారణంగా మృతి చెందారు. జిదాఫ్స్లోని అకామడేషన్‌లో ఈ ముగ్గురూ మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. తాహిర్ ఫరూక్, బినూ కుమార్, హజి మొహమమ్మద్ మృతి చెందగా, మరొక వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఎస్ఎంసి ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. గొడౌన్లో వారు నిద్రపోతుండగా, పొగ కారణంగా ఊపిరాడక ఆ ముగ్గురూ చనిపోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాసిఫ్ కన్స్ట్రక్షన్లో తాహిర్ ఫరూక్ పనిచేస్తున్నారు. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన మంతు కుమార్, అదే సంస్థలో పనిచేస్తున్నాడు. బినూకుమార్ భారతదేశానికి చెందిన వ్యక్తి. మిగతా ఇద్దరి జాతీయత గురించి వెల్లడి కావాల్సి ఉంది. చలి కారణంగా వెచ్చదనం కోసం చార్కోల్ని మండించగా, దాన్నుంచి వచ్చిన పొగ ముగ్గుర్ని బలి తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితులకు సహాయం అందించేందుకు ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ సంసిద్ధంగా ఉన్నట్లు కో-ఆర్డినేటర్ జాన్ ఫిలిప్ చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







