పార్కింగ్‌ చేసిన కార్లలో దొంగతనం: ఐదుగురికి జైలు శిక్ష

- February 22, 2017 , by Maagulf
పార్కింగ్‌ చేసిన కార్లలో దొంగతనం: ఐదుగురికి జైలు శిక్ష

పార్కింగ్‌ చేసిన కార్ల అద్దాల్ని పగలగొట్టి, దొంగతనానికి పాల్పడుతున్న ఐదుగురికి ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అబుదాబీ క్రిమినల్‌ కోర్ట్‌, దొంగతనం కేసులో దోషులుగా తేలిన ఐదుగురు ఆసియన్లకు ఈ శిక్షను ఖరారు చేసింది. గత ఏడాది చివర్లో వీరు పోలీసులకు చిక్కారు. తమ కార్ల నుంచి విలువైన వస్తువులు దొంగిలింపబడ్తున్నాయనీ, కార్ల అద్దాలు ధ్వంసం చేయబడ్తున్నాయనీ వాహనదారులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. పెద్దగా జనసంచారం లేని చోట్ల ఎక్కువ సమయం నిలిపివేయబడి ఉండే కార్లను నిందితులు టార్గెట్‌ చేసేవారు. రాత్రి వేళల్లోనే ఎక్కువగా నిందితులు దొంగతనాలకు పాల్పడేవారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com