ఆరోగ్యానికి చిట్కాలు... తప్పక తెలుసుకోవాల్సినవి....
- February 23, 2017
కూరగాయలు తరిగేటప్పుడు చేతులు తెగటం దాదాపుగా అందరికీ జరుగుతుంది. తెగిన వెంటనే గాయానికి పసుపు అద్దితే గాయం త్వరగా మానుతుంది. సెప్టిక్ కాదు. కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు మాయమవుతాయి.
కొందరికి కళ్ల చుట్టూ ముడతలు వస్తుంటాయి. బహుశా కళ్ల సమస్య ఉండి కూడా రావచ్చు. కనుక డాక్టరు సూచించిన మేరకు రీడింగ్ గ్లాసు వాడకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. డాక్టరు సలహాను అనుసరించి కళ్లను అధిక శ్రమకు గురిచేయకుండా జాగ్రత్త తీసుకోవాలి.
క్రమం తప్పకుండా ధనియాలు వాడుతుంటే అధిక రుతుస్రావం ఆగుతుంది. క్రమం తప్పకుండా సోయాబీన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను కరిగించి వేస్తుంది.
గర్భిణీలకు ఉదయాన్నే కాని, మరికొందరిలో ఏం తిన్నా కూడా వెంటనే వాంతులవడాన్ని చూస్తుంటాం. పరగడుపున ఒక టేబుల్ స్పూను తేనెలో అంతే మోతాదు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. తిన్నది కడుపులో ఇముడుతుంది.
గాయాల నుంచి రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాయాలి. గజ్జి, తామర వంటివి బాధిస్తుంటే ఒక టీ స్పూను మిరియాల పొడిలో ఒక టీ స్పూను నెయ్యి కలిపి రోజుకి మూడుసార్లు చొప్పున తీసుకుంటే తగ్గిపోతుంది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









