పాకిస్తాన్‌లో విమాన విషాదం

- February 24, 2017 , by Maagulf
పాకిస్తాన్‌లో విమాన విషాదం

పాకిస్తాన్‌కి చెందిన ఓ ప్రయివేట్ ట్రైనర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మార్గమధ్యంలోనే కుప్పకూలింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో విమానం నేర్పిస్తున్న ఇన్‌స్ట్రక్టర్ సహా ట్రైనీ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. షాహీన్ ఎయిర్ ఫ్లైయింగ్ ట్రైనింగ్ స్కూల్ (ఎస్ఏఎఫ్‌టీఎస్)కి చెందిన ఈ రెండు సీట్ల తేలికపాటి విమానం... ప్రమాదం కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:40 గంటలకు బయల్దేరిన ఈ విమానం 15 నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా పంజాబ్‌లోని ఫైసలాబాద్‌కు చేరుకోగానే కూలిపోయింది. దీనిపై విచారణకు ఆదేశించినట్టు పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
గతేడాది డిసెంబర్లో పాకిస్తాన్‌కి చెందిన ఓ విమానం కుప్పకూలడంతో 47 మంది చనిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com