అతివేగం తో డ్రైవ్ చేస్తూ పట్టుబడిన ప్రముఖ నిర్మాత కొడుకు
- February 24, 2017
మితిమీరిన వేగంతో వాహనం నడపుతూ ఇతర వాహనదారులను, పాదచారులను భయబ్రాంతులకు గురి చేసిన సినీ నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడు కిరీటి(22)పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ రోడ్ నంబర్-10లో నివసించే పరుచూరి కిరీటి బీటెక్ చదివాడు. హీరో బాలకృష్ణ నటించిన సింహ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
కొద్ది రోజుల నుంచి తన ఫార్చునర్ కారు( ఏపీ 09 సీవీ 2929)లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లపై దూసుకెళ్తూ ఇతరులకు ఇబ్బందికరంగా కలిగిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ విషయంపై నాలుగు రోజులుగా నిఘా పెట్టిన పోలీసులు, సీసీ ఫుటేజీల ఆధారంగా కిరీటీ ర్యాష్ డ్రైవింగ్ ను గుర్తించారు.
దీంతో శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ చౌరస్తాలో పోలీసులు నిఘా వేసి మితిమీరిన వేగంతో దూసుకొస్తున్న వాహనాన్ని ఆపి కిరీటిని అరెస్టు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







