ఖతార్ లో తెలుగింటి ఆడపడచు మృతి
- February 24, 2017
ఖతార్ లో బొగ్గుల కుంపటి పొగ పీల్చడం వలన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళ మృతి. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన పంతాని సత్యవతి (46) బ్రతుకుదెరువు కోసం ఖతార్ దేశానికి వెళ్లి ఒక అరబ్బు ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం చేస్తున్నది. గదిలో బొగ్గుల కుంపటి పొగ పీల్చడం వలన 6 ఫిబ్రవరి 2017 న ఆమె మృతి చెందినది. యజమాని ఇంట్లో మరో తెలుగు మహిళతో పాటు సత్యవతి ఒకే గదిలో ఉంటారు. రాత్రిపూట చలి ఉన్నందున గదిని వెచ్చబరచడానికి బొగ్గుల కుంపటిని వెలిగించారు. కుంపటిని ఆర్పేయకుండా నిద్రలోకి జారుకున్నారు. దట్టంగా వ్యాపించిన బొగ్గుల పొగను పీల్చడం వలన కార్బన్ మోనాక్సయిడ్ పాయిజనింగ్ అయి సత్యవతి మృతి చెందారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తగిన వెంటిలేషన్ (గాలి ప్రసరణ) లేకపోవడం, ఊపిరి ఆడకపోవడం ఈ సంఘటనకు కారణం. హైదరాబాద్ నుండి స్వగ్రామానికి శవపేటిక రవాణాకు ఉచిత అంబులెన్సు ఏర్పాటుచేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై విభాగం.
ఎం. భీమ్ రెడ్డి
_1487962345.jpg)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







