టాలీవుడ్ నిర్మాత శేఖర్‌బాబు గుండెపోటుతో కన్నుమూశారు

- February 24, 2017 , by Maagulf
టాలీవుడ్ నిర్మాత శేఖర్‌బాబు గుండెపోటుతో కన్నుమూశారు

టాలీవుడ్ నిర్మాత శేఖర్‌బాబు శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీ 
వుంటున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్నారు ఆయన. రెండేళ్ల కిందట శేఖర్‌బాబు గుండెకు ఆపరేషన్ 
జరిగిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
1946 మే 1న కేసీ శేఖర్‌బాబు జన్మించిన ఆయన, టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్, ముఠామేస్త్రీ, సుబ్బరాజు గారి కుటుంబం వంటి సినిమాలను నిర్మించారు. నిర్మాతల మండలి, ఫిల్మ్‌ఛాంబర్‌లో కూడా పని చేశారు. శేఖర్‌బాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com