మెట్రో రైడ్స్‌ని ఉచితంగా అందిస్తోన్న జూమ్
- February 25, 2017
జూమ్, అద్భుతమైన ప్రమోషన్ని ప్రారంభించింది. 60 మంది లక్కీ విజేతలకు దుబాయ్ మెట్రోలో ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్లు జూమ్ వర్గాలు వెల్లడించాయి. జూమ్ దుబాయ్ మెట్రో స్టోర్స్‌లో 20 దిర్హామ్‌లు అంతకు మించి ఖరీదైన షాపింగ్ చేసేవారికి 3,100 దిర్హామ్‌లు ఛార్జ్ చేసిన ఎన్‌ఓఎల్ కార్డులు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఫిబ్రవరి 19న ప్రారంభమయిన ఈ ప్రమోషన్ ఏప్రిల్ 19 వరకు ఉంటుంది. మొత్తం 60 మంది విజేతలు, రోజుకి ఒకరు చొప్పున ఈ ఆఫర్ పొందరగలుగుతారు. డ్రా తేదీలు 27 ఫిబ్రవరి, 6 మార్చ్, 13 మార్చ్ 27 మార్చ్ 3 ఏప్రిల్, 10 ఏప్రిల్, 20 ఏప్రిల్. 2009లో జూమ్, మెట్రో స్టేషన్లలో ప్రారంభమయ్యింది. 41 స్టోర్స్ ఇప్పటికే ఉన్నాయి. మరో రెండు కొత్త స్టోర్స్ ప్రారంభమవుతున్నాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







