మొబైల్ నెంబర్ కోసం 4.5 మిలియన్ దిర్హామ్స్
- February 28, 2017
దుబాయ్‌కి చెందిన బల్వీందర్ సహానీ, గత ఏడాది డి5 దుబాయ్ నెంబర్ ప్లేట్ కోసం 33 మిలియన్ దిర్హామ్‌లు వెచ్చించి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ఇప్పుడు ఎక్స్‌క్లూజివ్ డు మొబైల్ నంబర్ కోసం 4.5 మిలియన్ దిర్హామ్‌లు వెచ్చించి మరోసారి రికారు సృష్టించారు. అయితే దాన్ని తాను పర్సనల్ వినియోగం కోసం వినియోగించలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. కేవలం 2 గంటల సమయంలోనే ఆయన వెయ్యికి పైగా కాల్స్‌ని రిసీవ్ చేసుకున్నారు. తాను వెచ్చించిన మొత్తాన్ని డు సంస్థ ఛారిటీ కోసం వినియోగించనున్నట్లు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అబురాహిమా చెప్పారని అన్నారాయన. ఈ నెంబర్ కోసం ఎంత సొమ్ము అయినాసరే వెచ్చించాలని సహానీ అనుకున్నారట. 4,520,000 దిర్హామ్‌లు వెచ్చించి 058-8888888 నెంబర్ని ఆక్షన్‌లో దక్కించుకున్నారు. గ్రాండ్ హయాత్ దుబాయ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఆక్షన్ జరిగింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









