విద్యార్థులకు గూగుల్ సంస్థ కోర్సులను ప్రవేశపెట్టింది
- September 21, 2015
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్.. ఆండ్రాయిడ్ అప్లికేషన్లను రూపొందించేలా సాఫ్ట్వేర్ డెవలపర్లకు శిక్షణ ఇచ్చే ఆన్లైన్ డిగ్రీ కోర్సులను సోమవారం ప్రారంభించింది. అమెరికాలోని గూగుల్ ఇన్ స్ట్రక్టర్లు వీటికి సంబంధించిన పాఠాలను నేర్పనున్నారు. ఈ డిగ్రీల కోసం నెలకు 9,800 రూపాయల (148 డాలర్లు) ఫీజు చెల్లిం చాల్సి ఉంటుంది. ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో కోర్సులను పూర్తి చేయవచ్చు. కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు 50 శాతం ట్యూషన్ ఫీజును తిరిగి ఇవ్వనున్నారు. ఈ కోర్సులను ఆఫర్ చేసేందుకుగాను ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ ఉడాసిటీ, టాటాలతో గూగుల్ చేతులు కలిపింది. ఈ కంపెనీలు 1,000 మందికి ఉపకార వేతనాలను కూడా అందించనున్నాయి. గూగుల్ ఆఫర్ చేసే డిగ్రీల్లో ఉత్తీర్ణులైన వారు వచ్చే ఏడాదిలో భారత్‌లో గూగుల్ నిర్వహించే జాబ్ ఫెయిర్‌లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. భారత్‌లో 36 లక్షల మంది మొబైల్ యాప్ డెవలపర్లున్నారు. వీరిలో నైపుణ్యాలను పెంచడం ద్వారా ప్రయోజనం పొందాలని గూగుల్ భావిస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









