లాహోర్‌లో పీఎస్ఎల్ ఫైనల్
- February 28, 2017
లాహోర్: భద్రతపై తీవ్ర తర్జనభర్జనల అనంతరం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఫైనల్‌ను గడాఫీ స్టేడియంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం పాక్ గడ్డపై పీఎస్ఎల్ టైటిల్ ఫైట్ జరగనుంది. పాలకమండలి సభ్యులతో పీఎస్ఎల్ చైర్మన్ నజమ్ సేథీ చర్చలు జరిపాడు. దేశంలో పెరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రతపై సమాలోచన చేసిన అనంతరం పీఎస్ఎల్ ఫైనల్‌ను గడాఫీ స్టేడియంలోనే నిర్వహిస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపింది. వెంటనే పోలీసులు, ఆర్మీ... స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఐదంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
అయితే, లాహోర్‌ను ఫైనల్ వేదికగా ఎంచుకోవడాన్ని పాక్ దిగ్గజ పేసర్ ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా తప్పుపట్టాడు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!









