ఘోరంగా పరాజయం పాలైన ఫెదరర్
- March 02, 2017
మాజీ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 116 స్థానంలో ఉన్న కుర్రాడి చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన స్విస్ స్టార్ రోజర్‌కు ఇది ఘోర పరాభవం. దుబాయ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇవ్‌జెనీ డాన్స్కైయ్(రష్యా) చేతిలో 3-6, 7-6(9/7), 7-6(7/5) తేడాతో అతడు ఒటమిని ఎదుర్కొన్నాడు. తొలిసెట్‌ను ఫెదరర్ సునాయాసంగా సొంతం చేసుకున్నాడు. రెండు, మూడు సెట్లు టైబ్రేక్‌కు దారితీయడంతో రోజర్‌ను ఓడించిన డాన్స్కైయ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. 2017 సీజన్లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించిన స్విస్‌స్టార్ దూకుడుకు డాన్స్కోయ్ బ్రేక్ వేశాడు. ఈ ఛాంపియన్‌షిప్‌కి Joanna MacAdie, Media and PR Manager గా వ్యవహరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







