వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ అమెరికా నుంచి
- March 02, 2017
ట్రిపుల్ తలాక్..ఇద్దరు మహిళలను రోడ్డున పడేసింది. ఒకరు వాట్సప్ లో తలాక్..తలాక్..తలాక్ చెప్పేసి చేతులు దుపులుకోగా..మరొకరు తలాక్ నోటీసులు పంపడంతో ఆ ఇద్దరు మహిళలు ఆందోళనకు దిగారు. ఇదంతా ఇద్దరు అన్నదమ్ములే చేశారు. హైద్రాబాద్ మొఘల్‌పురాలో జరిగిన ఈ ఘటన నిరాహార దీక్ష వరకు వెళ్లింది. మలక్ పేటకు చెందిన మెహరిన్ నూర్‌కు.. 2015లో మెఘల్ పురాకు చెందిన అబ్దుల్ అఖిల్ తో నిఖా జరిగింది. ఉద్యోగరిత్యా అమెరికాలో ఉంటున్నాడు. ఏమైందో ఏమో గానీ.. ఫిబ్రవరిలో వాట్సప్ ద్వారా మెహరిన్ కు మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. ఇక నీకు నాకు చెల్లు అంటూ ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ తేల్చిచెప్పాడు. ఇక అత్తామామలు హఫీజ్, అలియాసుల్తానా కూడా ఇంటి వెళ్లిపోవాలంటూ వేధించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
అమెరికాలో ఉంటున్న అఖిల్ సోదరుడు సయ్యద్ ఫయాజుద్దీన్ సైతం తన భార్య హీనాఫాతిమాకు విడాకుల నోటీసులు పంపాడు. ఇది చూసి ఆమె షాకయ్యారు. అన్న వాట్సప్ లో తలాక్ చెప్పగా..తమ్ముడు తలాక్ నోటీసు చెప్పడంతో తోడికోడళ్లిద్దరు కలిసి రెండ్రోజులుగా అత్తవారింటి ముందు ఆందోళన చేపట్టారు. ఐతే.. తనకు వాట్సప్ లో ఎలాంటి సందేశం అందలేదని అబ్దుల్ అఖిల్ భార్య మెహరిన్ నూర్ చెబుతోంది. వాట్సప్‌లో తలాక్ చెప్పినంత మాత్రాన తాము ఎక్కడికి వెళ్లాలని బోరుమంటోంది. మరోవైపు ఫయాజుద్దీన్ భార్య సైతం ఇదే చెబుతోంది. అమెరికాలో ఉంటున్న భర్త ఉన్నపళంగా తలాక్ నోటీసులు పంపండంతో ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్‌లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్‌సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు









