ఖతార్ వచ్చే కార్మికులకు ఎలక్ట్రానిక్ ఒప్పందాలు
- September 22, 2015
ఖతర్ వచ్చే కార్మికుల కోసం ఎలక్ట్రానిక్ ఒప్పందాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఖతార్‌లో ఈ విధానం తొలిసారిగా అమలు చేయబడనుంది. మార్చ్ 2016 నాటికి అమలు చేయాలని యోచిస్తున్నట్లు కార్మిక, సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మహమ్మద్ అలీ అల్ మీర్ చెప్పారు. కార్మికులు వారి హక్కుల గురించి తెలుసుకోవడానికి ఈ విధానం ఉపయోగపడనుంది. కొత్త వ్యవస్థ ద్వారా కార్మికులు ప్రభుత్వ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చెయ్యగలగడం, వారి పేరు లేదా ఐడి లేదా వీసా నంబర్ వంటి వాటి ద్వారా వారి ఒప్పందాల వివరాల్ని వీక్షించగలరని ఆయన చెప్పారు. వారి సొంత భాషల్లో ఒప్పందాల వివరాల్ని తెలుసుకునే వీలుంటుంది. నేపాల్, ఉర్దూ సహా పది భాషలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుడుతున్నారు. 1.7 మిలియన్ విదేశీ కార్మికులు ఖతార్‌లో నివసిస్తుండగా, వారు వివిధ ఒప్పందాల ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 2020 నాటికి రెండు మిలియన్ల కన్నా ఎక్కువ మంది విదేశీ కార్మికులు ఖతర్‌లో నివసిస్తారనేది ఓ అంచనా. 2013, జూన్‌లో ఈ విలువ 42 బిలియన్ దిర్హామ్‌లుగా వుంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







