ముందస్తు జీతాల చెల్లింపు లేనట్టే
- September 22, 2015
ఈద్ అల్ అదా కోసం ముందస్తుగా జీతాల చెల్లింపు అవసరం లేదని మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. జీతాల చెల్లింపు తేదీ, ఈద్‌కి దగ్గరలో ఉంది గనుక, ప్రత్యేకంగా ముందస్తు జీతాల చెఇaల్లంపు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగం వ్యవధి తక్కువ ఉండటంతో ముందస్తు జీతాల చెల్లింపుపై నిర్ణయం తీసుకోలేదనీ, సెలవుల వ్యవధి తక్కువ ఉండటమే దీనికి కారణమని చెప్పారు. అయితతే అధికారిక ప్రకటన ముందస్తు జీతాలను ఆశిస్తున్నవారిని నిరాశపరిచింది. మహమ్మద్ ఫైసల్ అనే వ్యక్తి, ఈద్ అల్ అదా కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలనుకున్నామనీ, ఈ నిర్ణయం తమను నిరాశపరిచిందనీ, తమ ప్రణాళికల్ని మానుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రతి సంవత్సరం ముందే జీతాలు చెల్లించేలా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునేదనీ, ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుందని ఆశించినట్లు ఆయన వివరించారు. ప్రైవేటు కంపెనీల ప్రతినిథి ఒకరు, అధికారిక ప్రకటనను స్వాగతించారు. చాలా కంపెనీలకు నిధులు నెలాఖరుకు సమకూరుతాయి గనుక, ముందస్తు చెల్లింపులు ఇబ్బందికరంగా మారతాయని ఆయన చెప్పారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







