ఆ లీక్స్‌కు అసలు సూత్రదారి సుచినే..
- March 05, 2017
గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో సచిత్ర పేరు ఏ స్థాయిలో వినిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ సింగర్ అయిన సుచిత్ర తెలుగులో కూడా పలు పాటలు పాడిన విషయం తెల్సిందే. ధనుష్ మరియు సంగీత దర్శకుడు అనిరుధ్‌లు తనపై దాడి చేశారు అంటూ మొదలు పెట్టిన సుచిత్ర రోజు రోజు ఏదో ఒక వివాదాస్పద ట్వీట్స్ చేస్తూనే ఉంది. మొదట ఆమె భర్త కార్తీక్ ఆ ట్వీట్స్‌ను సుచిత్ర చేయడం లేదని, ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అంటూ చెబుతూ వచ్చాడు. తాజాగా సుచిత్ర అకౌంట్ ద్వారా పలువురి స్టార్స్ పర్సనల్ ఫొటోలు మరియు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు కూడా విడుదల అయ్యాయి. ఇక న్యూడ్ వీడియోలు కూడా ట్విట్టర్ ద్వారా సుచిత్ర అకౌంట్ ద్వారా విడుదల అయ్యాయి.
ఈ సమయంలో కూడా సుచిత్ర భర్త ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అంటూ చెబుతూ వచ్చాడు. పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అకౌంట్ హ్యాక్ అయితే కొన్ని నిమిషాల్లోనే దాన్ని రికవరీ చేసుకునే వీలు ఉంది. కాని ఎందుకు ట్విట్టర్ అకౌంట్ రికవరీ చేయడం లేదు, అంటే ఆ ట్వీట్స్ అన్ని కూడా సుచిత్ర చేస్తున్నట్లే కదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ అనుమానాలే నిజం అని తేలిపోయింది. తాజాగా సుచిత్ర భర్త స్పందిస్తు తన భార్యకు మానసిక పరిస్థితి బాగాలేదని, అందుకే ఆమె ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని ఆయన అన్నాడు. తన భార్య కారణంగా బాధపడ్డ ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాను అంటూ కార్తీక్ ప్రకటించాడు. దాంతో గత కొన్ని రోజులుగా వస్తున్న లీక్స్ అన్నింటికి సుచిత్రనే ప్రధాన కారణం అని తేలిపోయింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







