వాయిదా పడిన 'కంచె' విడుదల
- September 23, 2015
దసరాకు ముందే వస్తుందనుకున్న కంచె సినిమా దీపావళికి షిప్ట్ అవుతోందట. దీంతో.. ఇప్పటికే దీపావళికి ఫిక్స్ అయిన శంకరాభరణానికి ఈ సినిమా పోటీ ఇవ్వబోతోంది..! వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన కంచె సినిమాను గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్-2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ మారిందట. నెల రోజులపైనే ఈ సినిమా విడుదల వాయిదా పడింది. నవంబర్-6న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు హీరో వరుణ్ తేజ్. వరుసగా మెగా హీరోల సినిమాలు విడుదలకు క్యూ కట్టడంతో.. రిలీజ్ కు ఇది కరెక్ట్ టైం కాదని భావించినట్టు తెలుస్తోంది. అయితే.. కంచె రిలీజ్ టైమ్ కే మరో సినిమా కూడా రాబోతోంది..! అక్టోబర్ లో రామ్ శివమ్ సినిమాతో పోటీపడుతుందనుకున్న వరుణ్ తేజ్ కంచె చిత్రం దీపావళికి షిప్ట్ అయింది. దీంతో వరుణ్ కు పోటీ రామ్ నుంచి నిఖిల్ కు మారింది. ఇప్పటికే దీపావళి కానుకగా తమ సినిమా విడుదల కాబోతోందని శంకరాభరణం యూనిట్ ప్రకటించారు. గత ఏడాది దీపావళి కానుకగా వచ్చిన నిఖిల్ సినిమా కార్తికేయ విజయం సాధించడంతో ఆ సెంటిమెంట్ కొద్దీ.. దీపావళికే శంకరాభరణం సినిమాను విడుదచేస్తున్నారు. నిఖిల్ వరుస విజయాల్లో ఉండటం.. రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో... క్రైమ్ కామెడీ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిఫోర్ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న కంచె సినిమాకు.. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ శంకరాభరణంకు మధ్య బాక్సాపీస్ వద్ద పోటీ నెలకొనబోతోంది. మరి. రెండు వేర్వేరు జానర్స్ లో వస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా దీపావళికి సక్సెస్ పటాసును పేలుస్తుందో చూడాలి..!
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







