ముస్లిం మహిళా స్విమ్మర్లకు శుభవార్త
- March 05, 2017
పోటీ ఈవెంట్లలో పాల్గొనాలని భావించే ముస్లిం స్విమ్మర్లకు ఓ శుభవార్త. ముస్లిం మహిళలు తమ చట్టాలు ఉల్లంఘించకుండానే స్విమ్మింగ్ కాంపిటీషన్లలో పాల్గొనే వెసులుబాటును బ్రిటన్ అమెచ్యూర్ స్విమ్మింగ్ అసోసియేషన్ (ఏఎస్ఏ) కల్పించింది. పూర్తి స్థాయిలో శరీరాన్ని కప్పి ఉంచే బురఖా స్విమ్ సూట్‌ను ధరించినట్లయితే అమేచ్యూర్ స్విమ్మింగ్ ఈవెంట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా బరిలో దిగవచ్చునని అధికారులు వెల్లడించారు. ముస్లిం మహిళల స్పోర్ట్స్ ఫౌండేషన్ విజ్ఞప్తితో ఏఎస్ఏ ఆ మహిళలపై నిషేధాన్ని ఎత్తివేసింది.
అమేచ్యూర్ స్విమ్మింగ్ ఈవెంట్‌కు మాత్రమే రిలాక్సేషన్ ఇచ్చామని, అయితే ముస్లిం స్విమ్మర్ల ఫొటోలు ప్రచురించడంపై మాత్రం ఏఎస్ఏ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఏఎస్ఏ చైర్మన్ క్రిస్ బొస్టాక్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ఇది ఇంగ్లండ్ స్మిమ్మింగ్‌కు శుభ పరిణామమని కొనియాడారు. ఇలాంటి నిర్ణయాలతో ఎంతో మంది స్విమ్మింగ్‌పై ఆసక్తి చూపిస్తారని.. భవిష్యత్తులో ముస్లిం స్విమర్లలో ఎన్నో మార్పులకు ఈ అడుగు ఉపయోగ పడుతుందన్నారు.
ఒలింపిక్స్‌లో కూడా ఇలా పూర్తి తరహాలో శరీరాన్ని కప్పి ఉంచే బురఖా ధరించి పాల్గొంటామన్నా ముస్లిం మహిళలకు కొన్ని ముస్లిం ఆధిపత్య దేశాలు అందుకు అంగీకరించడం లేదన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







