'గురు' కోసం పాట పాడిన వెంకీ..
- March 05, 2017
ఇటీవల కాలంలో తెలుగు చిత్రసీమ కథానాయకులు అడపాదడపా పాటలు పాడుతున్నారు. తనదైన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న అగ్రకథానాయకుడు వెంకటేష్ కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గురు’. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘గురు’ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్గా నటిస్తున్న వెంకటేష్ ఓ పాట పాడారు. సంతోష్ నారాయణ స్వరాలు సమకూర్చారు. ఎన్నో విభిన్న పాత్రలతో మెప్పించిన వెంకటేష్ ‘గురు’ కోసం తొలిసారి పాట పాడటం విశేషం. రితికా సింగ్ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







