భారత జాలర్లను అరెస్టు చేసిన పాకిస్తాన్ నేవీ
- March 05, 2017
పాకిస్తాన్ నేవీ అధికారులు అరేబియా సముద్రంలో భారత్‌కు చెందిన 88 మంది జాలర్లను అదుపులోకి తీసుకుని, గుజరాత్ తీరప్రాంతానికి చెందిన 15 పడవలను స్వాదీనం చేసుకుంది. అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ జాలర్లను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గత మంగళవారంనాడు శ్రీలంక నేవీ అధికారులు 8 మందికి పైగా భారత జాలర్లను, ఒక పడవను ధనుష్కోడి సౌత్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర డెల్ఫ్ట్ ఐలాండ్ జలాల్లోనూ మరో 13 మంది భారత జాలర్లును అరెస్టు చేసి, రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం కనకేశన్‌తురై పోలీసు స్టేషన్‌కు వారిని తరలించారు. గత ఫిబ్రవరి 7న కూడా శ్రీలంక నేవీ అధికారులు తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన 10 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







