మహిళా సైనికుల నగ్న ఫొటోల కలకలం
- March 05, 2017
అమెరికాలో మహిళా సైనికులకు అవమానం జరిగింది. నేవీలో పనిచేస్తున్న మహిళా సైనికుల నగ్న ఫొటోలను సోషల్ మీడియాకు, ఆయా వెబ్సైట్లకు ఎవరో లీక్ చేశారు. ఈ విషయం తెలిసి ప్రస్తుతం ఆ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు సత్వర దర్యాప్తును ప్రారంభించారు. చిన్నస్థాయి నుంచి పెద్ద హోదాల్లో మహిళ సైనిక ఉద్యోగుల ఫొటోలు లీకయినవాటిల్లో ఉన్నాయంట. దీని వెనుక మిలిటరీ అధికారుల హస్తం ఉందని అంటున్నారు.
ఈ ఘటనకు సంబంధించి నేవీ పటాల అధికారిక ప్రతినిధి ఓ మీడియాకు వివరాలు చెబుతూ దీని వెనుక ఎంతమంది మిలటరీ అధికారుల హస్తం ఉందో, ఎవరు ఈ కుట్ర చేశారో తెలియాల్సి ఉందని చెప్పారు. నేవి దళ నేరాలు పరిశోధించే దర్యాప్తు విభాగం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
అక్కడి ఓ పేపర్ తెలిపిన వివరాల ప్రకారం నేవీ దళానికి సంబంధించి ఓ ఫేస్బుక్ గ్రూప్ పేజీ ఉంది. ఇందులో 30 వేలమంది సభ్యులు ఉన్నారు.
ఈ గ్రూప్‌లోనే సదరు నేవీ మహిళా అధికారుల నగ్న చిత్రాలు పెట్టారంట. దీంతో ప్రస్తుతం ఈ ఫేస్బుక్ పేజీని మూసి వేశారు. మహిళా అధికారుల నగ్న చిత్రాలు, వారి వివరాలు, ర్యాంకులు, పేర్లు పనిచేస్తున్న విభాగం వివరాలతో సహా ఇందులో పోస్ట్ చేశారంట. ఈ ఘటనపై అమెరికా నేవీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







