66 వేల మంది వలసపోయారు : ఐరాస
- March 05, 2017
సరిహద్దు విషయంలో సిరియాలో చెలరేగిన అంతర్యుద్ధం వల్ల 66 వేల మంది తమ ప్రాంతాలను వదిలి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి మానవత్వ సమన్వయ ఏజెన్సీ(ఓసీహెచ్‌ఏ) అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలకు మధ్య జరుగుతున్న పోరులో ఆల్ బాబ్, తడుఫ్ నగరాల నుంచి 40వేలమంది, ఆల్ బాబ్ తూర్పు ప్రాంత నుంచి 26వేల మంది స్థానికులు వెళ్లిపోయారని ఓసీహెచ్‌ఏ ఉత్తర అలెప్పో ఫ్రావిన్స్ పేర్కొంది. కొన్ని నెలల పోరాటం తర్వాత ఫిబ్రవరి 23న ఐఎస్ కబంధ హస్తాల నుంచి ఆల్ బాబ్‌ను టర్కీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. జిహాదీ గ్రూపులు సృష్టించిన పేలుళ్ల ద్వారా అధిక మొత్తంలో వచ్చిన కాలుష్యం వల్ల 40వేల మంది నగరం నుంచి వెళ్లిపోయినట్టు ఓసీహెచ్‌ఏ నివేదిక చెబుతోంది.
ఐఎస్ అంతం చేయాలని సంకల్పించిన నేపథ్యంలో చెలరేగిన విధ్వంసం వల్ల తూర్పు ఆల్‌బాబ్ నగరం 26వేలమంది వెళ్లిపోయారు. యూఎస్ సాయంతో సిరియన్ బలగాల ఆధీనంలో ఉన్న మాంబ్‌జీ పరిసర ప్రాంతాలకు శరణార్థులుగా వలస వెళ్లారని ఓసీహెచ్‌ఏ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







