'CMYF' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'మస్కట్ మెగా మిక్స్'ఈవెంట్
- March 05, 2017
గురువారం 2 మార్చ్ రాత్రి మస్కట్ నగరం నడిబొడ్డున అత్యంత వైభవంగా కన్నుల పండుగలా జరిగిన" CMYF చిరు మెగా యూత్ ఫోర్స్" వారు నిర్వహించిన "Muscat Mega Mix" ఈవెంట్ సాక్ష్యంగా నిలిచింది.
ఈ ఆధునిక యుగంలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా "we two n our two" అంటూ ఇంటికి పరిమితం అయిన ఈ గల్ఫ్ దేశంలో వేలాదిమందిని ఒకచోట కలిపే కార్యక్రమాన్ని శభాష్ అన్న రీతిలో దిగ్విజయంగా చేసి చూపించింది " చిరు మెగా యూత్ ఫోర్స్ అధ్యక్షులు శ్రీ రామదాసు చందక" ఆధ్వర్యంలో మన తెలుగు కళాకారుల అధ్బుత ప్రదర్శన మరియు డాన్స్,కామెడీ స్కిట్ లను మిళితం చేసి అత్యంత విశిష్ట వ్యక్తులు మరియు రక్త దాతల సేవలకు గుర్తింపుగా వారిని సన్మానంతో గౌరవించడం ముఖ్య ఉద్దేశంగా ఈ మెగా ఈవెంట్ కి రచన,దర్శకత్వం మరియు నిర్మాణ నిర్వహణలో అన్నీ తానై "One Man Army" లా శ్రీకారం చుట్టి Organising An Event అంటే ఇలా ఉండాలి అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మస్కట్ చరిత్రలో నిలిచిపోయేలా చేసారు "CMYF founder president శ్రీ.రామదాసు చందక".
ఇక సమాజంలో కర్తవ్య నిబద్దులై కర్మ యోగాన్ని ఆచరిస్తూ తమకు వీలైన సేవా కార్యక్రమాలను ఇతోధికంగా చేపట్టి నిష్టగా,మానవత్వానికి మరో రూపంలా సమ సమాజానికి ఒక దిక్సూచిలా ఉన్న సేవా పరాయణులు "మన తెలుగు వెలుగులు గౌరవనీయులు అయిన మా అఖిలభారత చిరంజీవి యువత జాతీయ అధ్యక్షులు శ్రీ రవణo స్వామి నాయుడు,తులసి గ్రూప్ ఆఫ్ చైర్మన్,అభినవ దానకర్ణుడుగా కీర్తి గడించిన శ్రీ రామచంద్ర ప్రభు గల్ఫ్ భాధితుల ఆశాజ్యోతి అయిన శ్రీ భీం రెడ్డి ( ప్రవాసి మిత్ర NGO సాంఘిక సేవా సభ్యులు)
వీరితో పాటుగా మస్కట్ లో ప్రాంతీయంగా పలురకాల సేవలను అందిస్తున్న శ్రీ రవిసాయి గారు(CEO TOWELL CO.)
శ్రీ ఇస్మాయిల్ షరీఫ్ (ప్రముఖ విద్యావేత్త)మరియూ శ్రీ ప్రసాద్ రెడ్డి (Local Tegodian Engineering &Consultancy)ను ఓమన్ దేశపు మంత్రిత్వ శాఖామాత్యులు శ్రీ అహ్మద్ అల్ కాబ్సి చే సన్మాన కార్యక్రమం ఆహుతులను విశేషంగా అలరించి మా CMYF ప్రతిష్టను ఇనుమడింపచేసాయి అని చెప్పడానికి మేము గర్విస్తున్నాము.
ఇక మా ముఖ్య అతిధి మెగా మేనల్లుడు సుప్రీం హీరో "సాయి ధరo తేజ్" చేతులమీదుగా ఎక్కువ సార్లు రక్తదాన మహోధ్యమంలో పాలు పంచుకున్నవ్యక్తులను ప్రశంసాపత్రంతో పాటు షీల్డ్ ల బహుకరణ జరుగుతున్నపుడు అభిమానుల కేరింతలు,ఈలలు,చప్పట్లతో వచ్చిన స్పందన ఈ కార్యక్రమానికే వన్నె తెచ్చింది.
సుమారుగా 2000 వేల మంది చిరంజీవి అభిమానగణం సందడితో కోలాహలంగా ఒక ఉత్సవంలా ఈ "Muscat Mega Mix" ప్రత్యేక అనుభూతిని అందించింది.
సుమనోహరమైన లాస్య వ్యాఖ్యానంతో,అంజనా సౌమ్య& గోపిక గార్ల శ్రావ్యమైన గీతాలతో మరియు జబర్ దస్త్ హైపర్ ఆది టీం కామెడీలతో ఆద్యంతం అలరిస్తే గాయకుడు మల్లిఖార్జున్ పాటలు పాడుతూనే చిరు స్టెప్పులతో హోరేత్తించాడు అలాగే బుల్లితెర నటులబృందపు డాన్సులు విశేషంగా అలరించాయి.
ఇక Blazers లో వెలిగిపోతున్న టీం CMYF సభ్యులు చక్కగా,పక్కాగా,పకడ్బందీగా సునిశిత పర్యవేక్షణలో ఈ ఈవెంట్ ని అత్యంత క్రమశిక్షణతో తుదివరకూ ఎలాంటి అపశృతులు దొర్లకుండా సమన్వయంతో చూసుకుని మెగాభిమానులా మజాకానా అని చాటి చెప్పారు.
ఇక ఈ అద్భుతమైన కార్యక్రమానికి కర్త,కర్మ,క్రియ అయిన రామదాసు చందక గారు చెప్పినట్టు వీరి మానసపుత్రిక అయిన CMYF చరిత్రలో ఇదొక మరపురాని మధురఘట్టం అనడంలో కించిత్ మాత్రమైనా అతిశయోక్తి లేదు.
ఈ విజయానందాన్ని నైతికంగా,మానసికంగా మా వెన్నంటి ప్రోత్సహిస్తున్న మస్కట్ లోని తెలుగు ప్రజలందరికీ అంకితమిస్తున్నాము మాపై మీ ఆదరణతో మా విజయాలు ద్విగుణీకృతo అవ్వాలని ఆశిస్తూ మీ భవదీయుడు.....రామదాసు చందక.







తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్‌సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







