మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు : రాజమౌళి
- March 06, 2017
నేషనల్ లెవల్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 చిత్రానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారని వస్తున్న వార్తలను దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని రాజమౌళి ట్విటర్ ద్వారా తెలిపారు. 'బాహుబలి 2 చిత్రానికి చిరంజీవిగారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.. అనేవి తప్పుడు వార్తలు' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను రామోజీ ఫిలిం సిటీలోనే మాహిష్మతి సెట్ దగ్గర ఉగాది రోజున భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అది కుదరని పక్షంలో ఫిలిం సిటీలోనే మరోప్రాంతంలో ఆడియో వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆడియో విడుదలకు కావాల్సి ఏర్పాట్లు కూడా ప్రారంభించారన్న టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న బాహుబలి 2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!







