బరువు తగ్గాలంటే.. మెట్లెక్కి దిగండి.. సైకిల్ తొక్కండి.. స్కిప్పింగ్ ఆడండి
- March 06, 2017
రోజూ అరగంట పాటు నడక.. అరగంట పాటు సైక్లింగ్ చేయడం ద్వారా బరువు తగ్గుతారు. వీలైనంతవరకు నడకకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇది వ్యాయామంలా అనిపించకపోయినా.. తెలియకుండానే కెలోరీలు ఖర్చైపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే జిమ్‌లకు వెళ్లకుండా ఇంట్లోనే మెట్లెక్కి దిగడం, కూర్చున్న చోటే కాళ్ళు, చేతుల్ని సాగదీయడం.. గుంజిళ్ళు తీయడం చేతుల్ని గుండ్రంగా తిప్పడం వంటివన్నీ వ్యాయామంలో భాగమేనని గుర్తించాలి.
సైకిలు తొక్కడం మొదలుపెట్టండి. చిన్నచిన్న పనులకు దానిపై వెళ్లడం అలవాటుగా మార్చుకుని చూడండి. అలాగే ఓ పదినిమిషాలు దొరికాయా. ఆ కాసేపూ స్కిప్పింగ్ ఆడండి. లేదా ఉన్నచోటే గెంతడం చేయండి. లేదా ఏదైనా డ్యాన్స్ క్లాసులో చేరండి. తప్పనిసరిగా వ్యాయాయమే చేయాలనే నియమాన్ని పెట్టుకోకుండా టైమ్ దొరికితే అలా నడవడం, గెంతడం, మెట్లెక్కి దిగడం వంటివి చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!