శ్రీలంక నేవీ భారత జాలర్లపై కాల్పులు
- March 06, 2017
సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లపై శ్రీలంక నేవీ దళాలు కాల్పులు జరపడంతో ఓ భారతీయ జాలరి ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం రాత్రి కచ్చతీవులు సమీపంలోని పాల్క్ స్ట్రెయిట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల బాధితుడి మృతదేహాన్ని రామేశ్వరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సోమవారం పెద్దసంఖ్యలో రామేశ్వరం నుంచి జాలర్లు చేపలు పట్టేందుకు బయల్దేరి వెళ్లారు. కచ్చతీవులు సమీపంలో పడుతుండగా శ్రీలంక దళాలు అక్కడికి చేరుకుని ఒక్కసారిగా కాల్పులు జరపడం ప్రారంభించాయి. కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా ఇవ్వకుండా కాల్పులకు దిగినట్టు మత్స్యకారులు వాపోయారు. కాల్పులు జరిగిన సమయంలో మొత్తం 2000 మంది జాలర్లు చేపల వేటలో ఉన్నట్టు సమాచారం.
మరోవైపు రాత్రి 10 గంటలకు సముద్రంలో కాల్పులు జరిగినట్టు రామేశ్వరానికి సమాచారం రావడంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. ''శ్రీలంక ఆర్మీ జరిపిన కాల్పుల్లో తంగచిమదంకు చెందిన బ్రిత్సో (22) అనే మత్స్యకారుడు చనిపోయాడు. మరో ఐదుగురు గాయపడ్డారు. రాత్రి 12:30 గంటలకు అంతా ఒడ్డుకు చేరుకున్నారు'' అని రామేశ్వరం మత్స్యకారుల నాయకుడు ఎమిరిట్ పేర్కొన్నారు.
కాగా శ్రీలంక దళాలు తమిళనాడు ప్రజలపై అమానుషంగా ప్రవర్తిస్తున్నాయని పేర్కొంటూ ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం పళనిస్వామి లేఖరాశాలు. కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే 32 మంది జాలర్లను నిర్భంధంలోకి తీసుకున్నాయనీ.. ప్రస్తుతం 128 బోట్లతో పాటు మొత్తం 85 మంది తమిళనాడు జాలరులు, శ్రీలంక ఆధీనంలో ఉన్నారని పేర్కొన్నారు. శ్రీలంక వ్యవహారంపై కేంద్రం చొరవతీసుకుని మత్స్యకారులను వెనక్కి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







