అబుధాబిలో భారతీయుడికి బంపర్ లాటరీ
- March 06, 2017
భారతదేశం నుంచి అబుదాబీకి వలస వెళ్లిన ఓ వ్యక్తికి రూ.12కోట్లు లాటరీ తగిలింది. కేరళకు చెందిన 33ఏళ్ల శ్రీరాజ్ కృష్ణన్ కొప్పరింబిల్ దాదాపు ఏడు మిలియన్ దిర్హామ్‌లు(రూ.12,71,70,000) విలువైన లాటరీని గెలుచుకున్నాడు. సండే రిలీజ్ చేసిన అబుధాబి బిగ్ టిక్కెట్ డ్రాలో ఆయన విజయం సాధించారు. ‘బిగ్ టిక్కెట్ విజేత తానే అని ఫోన్ రాగానే నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు 44698ను నా అదృష్ట నంబకర్ గా మారిపోయింది. ఈ టిక్కెట్ కొన్నప్పుడు ఇదే నా చివరి లాటరీ అనుకున్నాను. ఈ డబ్బుతో భారత్‌లో ఉన్న గృహ రుణాన్ని తీర్చేస్తాను. నా భార్య కూడా అదే అనుకుంటోంది. నాకు అదృష్టాన్ని తెచ్చిన దేశంలో నేను ఎందుకు ఉండకూడదు.. నేను పరిపక్వత ఉన్న మనిషిని భూమిపై నిలబడి ఆలోచిస్తాను.’’ అని కృష్ణన్ తెలిపారు.
యూఏఈ కి వలస వెళ్లిన కృష్ణన్ ఒక షిప్పింగ్ కంపెనీలో 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతను లాటరీలను తరచూ కొనుగోలు చేస్తుంటారు. కానీ అంతకుముందు ఎన్నడూ గెలుచుకోలేదు. ఇప్పుడే పెద్ద ప్రణాళికలు ఏమీలేవని కృష్ణన్ తెలిపారు. ముందు ఉద్వేగం తగ్గాక నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







