న్యూజిలాండ్‌లో ఇండియన్‌పై దాడి
- March 06, 2017
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ పుణ్యమా అని అక్కడ భారతీయల పట్ల రాజుకున్న విద్వేషం, ఇప్పుడు న్యూజిలాండ్‌కు సోకింది. ఆక్లాండ్‌లో రోడ్డు యాక్సిడెంట్ ఘటనలో భారతీయుడిపై స్థానిక వ్యక్తి దాడికి దిగాడు. అంతేకాదు నీ దేశానికి వెళ్లిపో అంటూ బెదిరించడం కలకలం రేగింది. ఈ ఘటనను బాధితుడు నర్విందర్‌సింగ్ ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీం ప్రసారం చేశాడు.
ఈ ఘటన తనను షాక్‌కు గురి చేసిందని సింగ్ వ్యాఖ్యానించాడు. దూషించడమేకాకుండా ఏదైనా ఆయుధంతో దాడికి పాల్పడుతాడేమోనన్న భయం తనను వెంటాడిందని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొద్దిరోజుల కిందట విక్రంజిత్ సింగ్ అనే భారతీయుడు దాడికి గురైన సంగతి తెలిసిందే.
అప్పట్లో అతడ్ని కూడా నీ దేశం వెళ్లిపో అంటూ ఓ స్థానికుడు ఒకరు బెదిరించాడు. దీనిపైనా కేసు నమోదైంది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







