2016లో 670 మంది బెగ్గర్స్ అరెస్ట్
- March 07, 20172015తో పోల్చితే, 2016లో ఇంకా ఉధృతంగా బెగ్గర్స్‌ని నిరోధించేందుకు చర్యలు చేపట్టామనీ ఈ క్రమంలో 670 మందిని అరెస్ట్ చేయగలిగామని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ ఓ నివేదికలో పేర్కొంది. 2015లో ఈ సంఖ్య 612గా ఉంది. మొత్తం 2338 తనిఖీల్ని నిర్వహించగా, అందులో మస్కట్లోనే 1,380 తనిఖీలను నిర్వహఙంచడం జరిగింది. నార్త్ అండ్ సౌత్ బతినాలో 120, బురైమి, దోఫార్లలో 50 చొప్పున తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో 670 మంది పట్టుబడ్డారు. మస్కట్‌లో అత్యధికంగా 482 మంది అరెస్ట్‌లు జరిగాయి. రమదాన్ సందర్భంగా సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోడానికి బెగ్గర్స్ ఎక్కువగా ప్రయత్నిస్తుంటారని అధికారులు తెలిపారు. పార్కింగ్ ఏరియాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ బెగ్గర్స్ తీవ్రత ఎక్కువగా ఉంటోందని వారు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బెగ్గర్స్ సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. పదే పదే బెగ్గింగ్ చేస్తూ పట్టుబడేవారికి జైలు శిక్ష తప్పనిసరి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం