యూఏఈలో స్వల్ప భూకంపం
- May 18, 2024
యూఏఈ: యూఏఈలో శుక్రవారం రాత్రి 1.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూఏఈ కాలమానం ప్రకారం రాత్రి 9.57 గంటలకు అల్ హలాహ్లో 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్ హలాహ్ అనేది వాడి తయ్యిబా సమీపంలోని ఫుజైరాలోని ఒక ప్రాంతమని, ఎటువంటి ప్రభావం పడలేదని తెలిపింది. యూఏఈలో భూకంపాల గురించి నివాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు తెలిపారు. యూఏఈ యాక్టివ్ భూకంప బెల్ట్లో ఉందని NCM అధికారి తెలిపారు.దీని కారణంగా సంవత్సరంలో రెండు నుండి మూడు వరకు భూకంపాలు వస్తుంటాయన్నారు. శుక్రవారం ఫుజైరాలో స్వల్ప భూకంపానికి ముందు, ఏప్రిల్లో ఖోర్ ఫక్కన్లో ప్రకంపనలు వచ్చాయి. జనవరిలో ఫుజైరా మరియు రస్ అల్ ఖైమా సరిహద్దులోని మసాఫీలో కూడా 2.8 తీవ్రతతో భూకంపం నమోదైంది.
తాజా వార్తలు
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!







