యాదాద్రిలో ప్లాస్టిక్‌ పై నిషేధం..ఉత్తర్వులు జారీ

- May 18, 2024 , by Maagulf
యాదాద్రిలో ప్లాస్టిక్‌ పై నిషేధం..ఉత్తర్వులు జారీ

యాదాద్రి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. ఆలయ పరిసరాల్లో ఆ నిషేధం అమలులో ఉంటుందని ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ వస్తువులు, ప్లాస్టిక్‌ కవర్లు మొదలు వాటి స్థానముల్లో ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్తువులు మాత్రమే వాడాలని పేర్కొంది. ఈ నిషేధాన్ని అందరూ విధిగా పాటించాలని ఆదేశించింది. దేవస్థానంలోని అన్ని విభాగాల్లో ప్లాస్టిక్‌ వినియోగం జరగకుండా తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత విభాగముల అధికారులను, సిబ్బందిని ఈవో ఆదేశించారు. కాగా, ఇప్పటికే యాదాద్రి ప్రధానాలయంలోకి సెల్‌ఫోన్లను నిషేధిస్తూ ఆలయ ఈవో భాస్కర్‌రావు ఉత్తర్వులను జారీ చేశారు.ఈ నిబంధనను సాధారణ భక్తులతోపాటు వీవీఐపీలు మెుదలుకొని.. అధికారులు, సిబ్బంది, అర్చకులు, పోలీసులు, మీడియా, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికీ నిబంధన వర్తించనుంది. ఎవరైనా ప్రధాన ఆలయంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com