లంచాల్లో 'భారత్' టాప్

- March 07, 2017 , by Maagulf
లంచాల్లో 'భారత్' టాప్

ప్రభుత్వ ఉద్యోగులతో పని పడితే చాలు.. ఎక్కడ లంచం ఇచ్చుకోవాల్సి వస్తుందోనన్న భయం. భారత్ లో మూడింట రెండొంతుల మంది జనం లంచం ఇచ్చుకోక తప్పని పరిస్థితి. 16 ఆసియా పసిఫిక్ దేశాల్లో లంచావతారులు ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ అప్రతిష్టను మూటగట్టుకుంటోంది.

తాజాగా ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో ప్రతీ 10 మంది భారతీయుల్లో ఏడుగురు లంచాలు ఇచ్చుకోక తప్పని పరిస్థితి నెలకొందని సంస్థ తెలిపింది. భారత్ లో ప్రభుత్వ సేవలు పొందాలంటే లంచం ఇవ్వక తప్పట్లేదని 69శాతం మంది భారతీయులు అభిప్రాయపడినట్లు సర్వే వెల్లడించింది. 65శాతం లంచాలతో వియత్నాం భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది.
మరోవైపు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో లంచాల తీవ్రత అత్యంత తక్కువగా ఉన్న దేశంగా జపాన్ నిలిచింది. ఆ దేశంలో కేవలం 0.2శాతం మంది మాత్రమే లంచాల బారిన పడుతున్నట్లుగా సర్వే వెల్లడించింది. దక్షిణ కొరియాలో ఇది 0.3శాతంగా ఉంది.
ఇక మన పొరుగునే ఉన్న పాకిస్తాన్‌లో 40 శాతం, చైనాలో 26 శాతం మంది ప్రజలు లంచాలు ఇచ్చుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. మొత్తంగా ఆసియా పసిఫిక్ దేశాల్లో మొత్తం 90కోట్ల మంది ప్రజలు లంచాలు సమర్పించుకుంటున్నట్లుగా సర్వే తెలిపింది. ఇండియాలో లంచాల బారినపడుతున్నవారిలో ఎక్కువ మంది పేద వర్గాలకు చెందినవారేనని సర్వే ద్వారా వెల్లడైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com