అమెరికాలో 15 ఏళ్ల జైలు శిక్ష భారతీయుడికి
- March 08, 2017
ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్నాడని ఓ భారతీయుడికి అమెరికా 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఖలిస్తాన్ ఉద్యమంలో భాగంగా ఓ భారత ఉన్నతాధికారిని చంపేందుకు కూడా ఇతడు పథకం వేశాడని విచారణలో తేలింది. బల్వీందర్ సింగ్ అనే ఈ 42 ఏళ్ళ వ్యక్తి స్వతంత్ర సిక్కు రాష్ట్రం కోసం ఉద్యమానికి ప్రేరేపించేలా ఉగ్రవాద దాడులకు కుట్రచేస్తున్నాడని అమెరికా అటార్నీ డానియెల్ బోగ్డెన్, ఎఫ్బీఐ స్పెషల్ ఏజెంట్ ఇంచార్జ్ ఆరోన్ సీ రౌజ్ కోర్టుకు నివేదించారు. ఇందుకోసం అతడు అమెరికాలో అతడుంటున్న రెనో నుంచి కాలిఫోర్నియాలోని అతడి సహచరుడ్ని వ్యక్తిగతంగా కలుసుకున్నాడని 2013లో ఇతడి బృందంలోని ఒకరు ఉగ్రదాడుల కోసం ఇండియా వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారని కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఇందుకోసం సదరు వ్యక్తికి రెండు సెట్లనైట్ విజన్ గూగుల్స్తో పాటు, ల్యాప్టాప్ కంప్యూటర్లను బల్వీందర్ సింగ్ సమకూర్చాడని పేర్కొన్నారు. విచారణ అనంతరం నిందితుడికి 180 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ రెనోలోని యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి లారీ హిక్స్ తీర్పు చెప్పారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







