19 మంది చైనా ప్రజల మధ్య పోరాటం దుబాయ్ లో ఒకరు మృతి

- March 08, 2017 , by Maagulf
19 మంది చైనా ప్రజల మధ్య పోరాటం దుబాయ్ లో ఒకరు మృతి

ఈ సంఘటన గత సంవత్సరం మార్చి 23 వ తేదీన జరిగింది. దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీ లో చైనా బృందంలో ఈ పోరాటం జరిగింది. 19 మందికి పైగా చైనా దేశానికి చెందిన వ్యక్తుల ప్రత్యర్థి ముఠాలు మధ్య జరిగిన పోరాటంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ తెలిపిన వివరాల ప్రకారం పోరాట సమయంలో గొడ్డలి, కర్రలు మరియు కత్తులు ఉపయోగించారు. ఒక 33 ఏళ్ల ఒక చైనా నిరుద్యోగ వ్యక్తికి సైతం శిక్ష విధించబడింది. సహచరులలో ఒకరిని ఒమన్ మీదుగా దేశాన్ని విడిచివెళ్లేందుకు  సహాయం చేశాడు. సరిహద్దు కేంద్రం వద్ద  రవాణా చేసేందుకు  ఒక కారుని  ఏర్పాటు చేయడమే కాకుండా  అతనికి తోడుగా ప్రయాణించాడని అభియోగాలు ఆ వ్యక్తిపై  నమోదు చేశారు. మరో ఇద్దరు వ్యక్తులు సైతం చట్టవ్యతిరేక చర్యలలో పాల్గొన్నట్లు ఆరోపించింది. నాటి సంఘటనలో పలువురు తప్పిచుకఁగోగా మొత్తం 14   మందిని అరెస్ట్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com