కార్మిక చట్టాలపై ట్రంప్ తూట్లు

- March 08, 2017 , by Maagulf
కార్మిక చట్టాలపై ట్రంప్ తూట్లు

అమెరికాలో కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా గత బరాక్‌ ఒబామా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ట్రంప్‌ సర్కార్‌ ఒక్కొక్కటిగా రద్దు చేసింది. కార్మికులకు భద్రత కల్పించే నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా సెనేట్‌ సోమవారం ఆమోదించింది. ప్రభుత్వ కాంట్రాక్టర్లు కార్మికులతో ఎక్కువ పని చేయించుకునేందుకు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన సందర్భాలను వెల్లడించాలని గత ఒబామా ప్రభుత్వం నిబంధన పెట్టింది.
ఈ నిబంధనను రద్దు చేసే తీర్మానాన్ని సెనేట్‌ 49-48 ఓట్లతేడాతో ఆమోదించింది. దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదానికి పంపారు.  
పని ప్రదేశంలో భద్రత, వేతనాలు, వివక్ష వంటి 14 అంశాలకు సంబంధించిన ఉల్లంఘనలను వెల్లడించాలని నాటి ఒబామా ప్రభుత్వం అమలుచేసిన ఈ చట్ట నిబంధన చెబుతోంది. కాంట్రాక్టర్లు దాఖలు చేసిన బిడ్లను పరిశీలించే సమయంలో ఈ ఉల్లంఘనలను అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఉల్లంఘనలకు సంబంధించిన సమా చారాన్ని కాంట్రాక్టర్లు అందజేయకపోవడంతో కొన్నేళ్లుగా ప్రభుత్వ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యకు ఒబామా ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకురావడం ద్వారా పరిష్కా రమైంది. అయితే వ్యాపార సంస్థలకు మాత్రం ఈ నిబంధన మింగుడుపడలేదు. కొందరు కాంట్రాక్టర్లు చేసే తప్పిందాలకు అందరినీ శిక్షించడం సరికాదని, దీనివల్ల కంపెనీలకు ఖర్చు పెరిగిపోతుందని వాపోయారు.  
కార్మికులకు భద్రత కల్పించే చట్ట నిబంధనలను పదేపదే ఉల్లంఘించే కాంట్రాక్టర్లు ఇతర మార్గాల్లోనూ రక్షణ నిబం ధనలకు తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తూనే వుంటా రని ఒబామా తీసుకొచ్చి నిబంధనలను సమర్థించేవారు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యలు ఇటు ప్రజలకు, అటు ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తాయం టున్నారు.  
ట్రంప్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ ఒబామా కాలం నాటి మూడు చట్టాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ వారంలో మరికొన్ని చట్టాల రద్దుకు సంబంధించిన ప్రతిపాదనలను సెనేట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సెనేట్‌ మెజార్టీ పక్ష నేత మిచ్‌ మెక్‌ కానెల్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com